అరుంధతీ నక్షత్రం కనిపించేది రాత్రి పూట మాత్రమే. దీవి వెనుక ఒక కథ ఉన్నది. అరుంధతీదేవి మహా పతివ్రత .అగ్ని హోత్రుడు సప్తఋషుల భార్యల అందానికి మోహింపపడి క్షీణించిపోతూ ఉండగా వివరం తెలుసుకున్న అగ్ని హోత్రుడి భార్య స్వహా దేవి వశిష్టుడి భార్య ఐన అరంధతీ తప్ప మిగతా అందరి భార్యల వేషమూ వెయ్య గలిగింది, కానీ ఎంత ప్రయత్నించినా అరుంధతీ దేవి వేషం వెయ్యలేక పోయింది. అందుకనే మహా పతివ్రత అయిన అరుంధతిని నూతన వధూవరులకు సప్తపది అయిన తరువాత దర్శనం చేసుకోమంటారు.
అరుంధతి భారత పురాణాలలో వశిష్ట మహాముని భార్య మరియు మహా పతివ్రత. భారతీయుల వివాహములో అరుంధతి నక్షత్రాన్ని చూపించడం ఒక ముఖ్యవిధి.
అరుంధతి వశిష్ఠ మహర్షి ధర్మపత్ని, మహా పతివ్రత అని ఆకాశం వంక పెళ్లిసమయంలో చూపించి చెబుతారు బ్రాహ్మణులు. అలా చేస్తే మీ సంసారిక జీవనం నల్లేరు మీద నడకలా సాగుతుందని పండితులు వధూవరులకు చెబుతారు. మాఘమాసాది పంచ మాసాల కాల మందు తప్ప ఈ నక్షత్రం సాయంత్రం వేళ కానరాదు.
రాత్రిపూట చంద్రుడ్ని, నక్షత్రాలను చూడటం వల్ల కంటి శక్తి పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల కంటి శక్తి మరింత పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం సప్తర్షి మండలంలో ఉండే చిన్న నక్షత్రం, శిశిర, వసంత, గ్రీష్మ ఋతువులందు సాయంకాల సమయాన, మిగిలిన కాలాల్లో అర్థరాత్రి లేదా దాటిన తర్వాత తెల్లవారుజామున కనిపిస్తుంది.
అరుంధతి నక్షత్రాన్ని చూడాలనుకుంటే జాగ్రత్తగా ఆకాశం వంక చూడండి. సప్తర్షి మండలంలో పక్కపక్కనే ఉండే నక్షత్రాలే అరుంధతి, వశిష్ఠులవారు. అరుంధతి నక్షత్రం చిన్నగా ఉంటుంది.