1.మునులు యదువంశమును శపించుట
2.ద్వారకలో దుశ్శకునాలు
3.సముద్రుడికి జాతర
4.యాదవులలో చెలరేగిన గందరగోళం
5.సాత్యకి కృతవర్మను వధించుట
6.యాదవకులములో అంతర్యుద్ధము
7.బలరాముని పరలోక యాత్ర
8.శ్రీకృష్ణుడి నిర్యాణము
9.శ్రీకృష్ణుడు వైకుంఠమును చేరుట
10.దారుకుడు హస్థినకు చేరుట
11.అర్జునుడి ద్వారక ప్రవేశము
12.వసుదేవుడు కృష్ణుడిని గుఱించి చెప్పుట
13.వసుదేవుడు విలపించుట
14.అర్జునుడు ద్వారకాపుర
15.వసుదేవుడు తనువు చాలించుట
16.అర్జునుఁడు శ్రీకృష్ణుని కొఱకు వెదకుట
17.అర్జునుడు యాదవులకు
18.అర్జునుఁడు శ్రీకృష్ణబలరాములకు
19.యదుస్త్రీలు అర్జునునితోఁగూడి
20.హస్థినలో యాదవులకు
21.శ్రీకృష్ణ నిర్యాణ వార్తను ఎఱిఁగించుట
22.అర్జునుడు వ్యాసుని దర్శించుట

జనమేజయుడి ప్రశ్నకు బదులుగా వైశంపాయనుడు జనమేజయమహారాజా ! ఈ విషయము ఇప్పటిది కాదు. చాలాకాలము కిందట జరిగిన దానికి ఇది ఫలితము. చాలాకాలము కిందట కణ్వుడు, నారదుడు, విశ్వామిత్రుడు మొదలైన మునులు శ్రీకృష్ణుడిని చూడడానికి ద్వారకకు వచ్చారు. ఈ మునులను చూసిన యాదవులకు ఆ మునులను ఆట పట్టించాలన్న దుర్బుద్ధి కలిగింది. వెంటనే వారు వారిలో చిన్న వాడైన సాంబుడికి ఆడవేషము వేసి అతడిని మునుల వద్దకు తీసుకు వచ్చి మునులారా ఈమె మా స్నేహితుడు బభ్రుడి భార్య. వారికి చాలా రోజులుగా సంతానము లేదు. అసలు వారికి సంతానము కలుగుతుందా లేదా ? తెలియజేయండి అని అడిగారు. వారి ముఖాలు చూడగానే మునులు వారు తమను హేళన చేస్తున్న విషయము గ్రహించి వీడు శ్రీకృష్ణుడి కుమారుడు ఇతడు మగవాడు. వీడు ఒక ముసలమును కంటాడు. ఆ ముసలము శ్రీకృష్ణుడు, బలరాములను తప్ప మిగిలిన యాదవులు అందరిని సర్వనాశనము చేస్తుంది. బలరాముడు మాత్రము యోగనిష్టతో సముద్రములో ప్రవేశిస్తాడు. శ్రీకృష్ణుడు నేలమీద పదుకుని ఉండగా జర అను రాక్షసి శ్రీకృష్ణుడిని చంపుతుంది. మీ కపటనాటకముకు ఇది తగినశిక్ష అని శపించిన ఋషులు శ్రీకృష్ణుడిని చూడకుండా వెళ్ళిపోయారు. ఈ విషయము శ్రీకృష్ణుడికి తెలిసినా జరగనున్నది జరగక మానదు అని మిన్నకుండి పోయాడు.


మరుసటి రోజే మునుల శాపము ఫలించి సాంబుడు ఒక ముసలమును ప్రసవించాడు. అది చూసి యాదవులు ఆశ్చర్యచకితులై ముసలమును సాంబుడిని వసుదేవుడి వద్దకు తీసుకు వెళ్ళారు. వసుదేవుడు భయభ్రాంతుడు అయ్యాడు. వసుదేవుడు ఆ ముసలమును చూర్ణము చేసి సముద్రములో కలపమని యాదవులకు చెప్పాడు. అందువలన వసుదేవుడు ఇక ఆ ముసలము వలన ఆపద ఉండదు అనుకున్నాడు. యాదవులు వసుదేవుడు చెప్పినట్లు చేసి ఆ విషయము అంతటితో మరచిపోయారు. కాలము గడచింది మహాభారత యుద్ధము జరిగింది. తన కుమారుల మరణాన్ని శ్రీకృష్ణుడు ఆపలేదన్న బాధతో గాంధారి తన కుమారుల వలెనే యాదవులు అందరూ దుర్మరణము పాలు కాగలరని శపించింది. తరువాత కొంత కాలానికి ద్వారకలో ఉత్పాతాలు సంభవించాయి. దానికి తోడు యమధర్మరాజు తన చేత యమపాశము ధరించి ద్వారకలో సంచరిస్తున్నాడన్న వార్త ద్వారకలో పొక్కింది. అది విన్న యాదవులు భయభ్రాంతులు అయ్యారు.